Saturday, 4 April 2020

My Ego with Samantha..Oh Baby!

Slide 1 of 6: After playing back-to-back serious characters, Samantha Akkineni is going to light up the screen with her next release, Oh! Baby. The film will see the actor portray a jovial character.


సమంత 96 మూవీ లో నాకు ఎందుకు నచ్చ లేదో కాదు ఎందుకు నప్పలేదో అర్ధం కాలేదు ఇన్నాళ్ల దాకా. 

తమిళ్ వెర్షన్ ఆల్రెడీ చూశాననా , త్రిష పెరఫామాన్సా లేక సమంత పైన ఎక్సపెక్టషనా ? ఏమో కారణం తెలియదు. ఎం మాయ చేసావో నుంచి నిన్నటి మజిలీ వరకు ఒంటి చేత్తో సినిమాని మోయగల సత్తా సమంత  ది, మరి 96 మూవీ కి ఎందుకు న్యాయం చేయలేదు అని నా బాధ. ఇది నా స్వార్ధం ఎందుకంటే తెలుగు వెర్షన్ తమిళ్ కన్నా ఓ మెట్టు పైన ఉండాలి, స్ట్రెయిట్ హిట్ కావాలి అండ్ మాక్సిమం రీచ్ అవ్వాలి  అని. కానీ ఆలా జరగ లేదు. మొదట కోపం దిల్ రాజు మీద, ఎందుకు అనవసరంగా ఓ క్లాసిక్ ని కెలికారని, నెక్స్ట్ సమంత మేజిక్ ఎందుకు మిస్ అయ్యిందని. 

96  తెలుగు అన్ని విధాలా తమిల్ వెర్షన్ కి ఎక్కడ తగ్గ లేదు. హర్వానంద్ ని చూస్తున్నంత సేపు విజయ్ సేతు పతి ని మర్చి పోయా. శర్వా ఇస్ ఇర్రేప్లేసుబుల్ ఈ వెంచర్ కి.  సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ ఫర్ లైఫ్ అఫ్ రామ్ సాంగ్ కి ప్రాణం పోశాయి. కొన్ని వందల  సార్లు రిపీట్ మోడ్ లో వి విన్నా అండ్ వింటున్నా!

Lyricist Sirivennela Seetharama Sastry on winning Padma Shri Award ...

"ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇప్పుడే నను కనగా
అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కథ నేను గా..

గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడ గా

 యే చిరునామా లేక.. యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తోందో కేక.. మౌనం గా........ "

"అమ్మ ఒడిలో మొన్న..
అందని ఆశల తో నిన్న..
ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి
అంత దూరానున్నా.. వెన్నెల గా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి"

ఈ నాలుగు మాటలు చాలవా మనసుని మల్లి మల్లి కుదిపేయటానికి పాటని ని రిపీట్ మోడ్ లో పెట్టటానికి. ఏకాంతంగా ఇప్పుడు ఓసారి కళ్ళు మూసి విని చూడండి ఈ పాట.... నా మాట నమ్మక పోతే! 

సాంగ్ లిరిక్స్ ఆడియో లింక్  :

Sharwanand Jaanu Life of Ram Video Song Govind Vasantha Samantha

కానీ ఇండియా లో ఈ పాట  షూట్ చేయాల్సింది కాస్త నేటివిటీ అట్టాచ్మెంట్ కోసం లైక్  ఇన్ తమిళ్. గోవింద్ వసంత,  ప్రదీప్ కుమార్ అండ్ చిన్మయి కాంబో మల్లి వెన్నెముక తెలుగు వెర్షన్ కి. యంగ్ వెర్షన్ అఫ్ శర్వా అండ్ సమంత అర్ ఎట్ పార్ విత్ తమిళ్ వెర్షన్.  సోల్ ని ఎక్కడ దిస్టర్బ్  చేయకుండా  తీశారు. ఈ విషయం లో దిల్ రాజు ప్రొడ్యూసర్ని పక్కన పెట్టి అతనిలో ఉన్న ఓ సినీ ప్రేమికుడిని మెచ్చు కోవాలి. ఓ క్లాసిక్ ని తెలుగు ఆడియన్స్ కి ఇద్దామనే ఆయన తాపత్రయం ని అభినందించాలి.  

మొన్న మజిలీ సినిమా సగం అయ్యాక వర్షం లో గొడుగు తో సమంత ఇచ్చిన ఎంట్రన్స్ ఏ హీరో ఎంట్రన్స్ సీన్ కి తక్కువ కాదు.  మజిలీ ని తన భుజాలపై ఎలా మోసు కెళ్ళిందో మనకి తెలుసు. ఆకోర్సు నాట్ హర్ ఫస్ట్ టైం. 

ఇన్ని ఉన్న "అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్నట్లు 96 సినిమా కి సమంత ఎందుకు నప్పలేదు. ఆన్సర్ దొరకలేదు.... ఈ క్షణం దాకా. 

 ఇప్పుడే ఓహ్ బేబీ! చూసా. అర్ధం అయిపోయింది.

96 తెలుగు చూసినప్పుడు త్రిష లాగ సమంత అంత సెటిల్ గ పెర్ఫర్మ్ చేయలేదు అనుకున్న. కానీ ఇప్పుడు అర్ధ అయ్యింది. సమంత క్యాలిబర్ కి 96 కాన్వాస్ కరెక్ట్ కాదని. సమంత విజృంభిచటానికి ఇరుకు గదులు చాలవు విశాల మైదానమం కావాలి. ఓహ్ బేబీ! ఓ ఉదాహరణ. 60 ఏళ్ళ భామ బాడీ లాంగ్వేజ్ ని ఓ ఈజ్ తో 23 ఏళ్ళ అమ్మాయి లో చూపించ గలగటం ఓ రేర్ ఫీట్. లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్, మేనరిజంస్, ఎక్స్ప్రెషన్స్ ని డీటెయిల్స్ లో చూస్తే అర్ధం అవుతుంది వై శి ఇస్ నెంబర్ వన్ అండ్ వై శి ఇస్ స్టిల్ రూలింగ్ సౌత్ అని. క్లైమాక్స్ సీన్ లో రావు రమేష్ అండ్ సమంత ఆక్ట్ గొంతు ని బరువెక్కించేస్తుంది,  గుండె ని కుదిపేస్తుంది. సమంత సీన్స్ విత్ శౌర్య.... స్పెషల్లీ ది నైట్ అవుట్ సీన్ "ఇంటరాక్షన్ ఆన్ కౌచ్" ఇస్ మెస్మేరేజింగ్. 

కొన్నేళ్ల క్రితం తెలుగు మూవీ జబర్దస్త్ ఆన్ లొకేషన్ లో ఓ రోజు గడిపా. పిక్ అందరితో తీసుకున్న ఇంక్లూడింగ్ సిద్ధార్థ, శ్రీహరి అండ్ ధర్మవరపు గారు, కానీ ఎందుకో సమంత తో ఫోటో తీసుకోవాలనిపించలేదు. మల్లి లాస్ట్ ఇయర్ వైజాగ్  టు హైదరాబాద్ ఫ్లైట్ లో అండ్ tarmac టు టెర్మినల్ బస్సు లో ప్రయాణం కానీ ఫోటో కోసం ఎగ బడాల అనిపించింది.   

ఈ అమ్మాయి హీరోయినా అని. అది నా ఇగో కావచ్చు మూర్ఖత్వం కావచ్చు.. కానీ ఈరొజు సమంత  ఓహ్ బేబీ! మూవీ పెర్ఫార్మన్సే అన్నింటికీ సమాధానం. సరైన స్క్రిప్ట్ దొరికి తే  ఆకాశమే ఆమెకు హద్దు….

ఈ సారి మల్లి ఆమె నాకు దొరికితే ఫోటో విత్ క్షమాపనే నా దిక్కు!

మీ 
వెంకీ !

1 comment:

  1. 96 movie lo Trish oka Adbuthamaina performance anupinchindi adi acting tho paatu feeling add avadam oka plus point.

    Telugu lo Samantha role as it is ga undadam, prati frame lo manam samantha ni kante ah place lo Trisha ela chasindi ani mana brain vetukkodam jarugutundi, enduaknte telugu movie Samantha chareter script lo change ledu kothaga oche feel em kaaadu.

    Oka Charecterization lo variations depth unte mamulu actor kuda involve ayi act chese chance ekuva untundi, ade chinna chinna variation ni kuda chupinchagaliginapude Mahanati avutaaru.

    ReplyDelete